calender_icon.png 22 April, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ మహాసభకు భారీగా ఎన్నారైలు

14-04-2025 12:40:57 AM

బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల 

50దేశాల ఎన్నారైలతో జూమ్‌మీటింగ్‌లో వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభకు వివిధ దేశాల నుంచి భారీగా ఎన్నారైలు హాజరుకానున్నారని బీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. సంవత్సరం పాటు వివిధ దేశాల్లో ఎన్నారైలు పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.

ఆదివారం 50 దేశాల ప్రతినిధులతో మహేశ్ బిగాల జూమ్‌కాల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఉద్యమ సమయం లో టీఆర్‌ఎస్‌కు ఎన్నారైలు అండగా ఉన్నారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. వివిధ దేశాల్లో జరిగే వేడుకలకు బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు హాజరవుతారని పేర్కొన్నారు.