16-12-2024 07:27:21 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గ్రూప్-2 పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ తల్లి కోసం ఏడుస్తున్న బిడ్డకు పాలు పట్టిస్తూ కఠినమైన విదుల్లోనూ తల్లి ప్రేమతో ఆమె కరుణ చూపించి లాలించింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్లిన అభ్యర్థి తన పాపను బంధువుల దగ్గర ఉంచి వెళ్ళింది. కానీ ఆకలితో గుక్క పట్టి ఏడుస్తుండగా బంధువులు కూడా ఎంతగా లాలించినా ఏడుపు ఆపకపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న మహాలక్ష్మి అనే లేడీ కానిస్టేబుల్ ఆ పాపకి పాలు పడుతూ లాలించింది.