calender_icon.png 7 January, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిజ్జాలో కత్తిముక్క!

06-01-2025 01:20:45 AM

షాకైన కస్టమర్.. క్షమాపణలు చెప్పిన డోమినోస్

పూణే, జనవరి 5: హోటల్ ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇక ఆర్డర్ చేసిన ఫుడ్‌లోనూ ఇదే పరిస్థితి.  ఆకలిగా ఉంది పిజ్జాను లాగిద్దామనుకున్న  ఓ వ్యక్తి ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టాడు. కొద్దిసేపటికి ఆర్డర్ రావడంతో ఎంచక్కా తినడం మొదలుపెట్టాడు. ఇంతలో ఏదో వస్తువు నోటిలో తగలడంతో తీసి చూశాడు. అందులో ఓ కత్తిముక్క ఉండడంతో భయంతో కంగుతిన్నాడు.

ఈ ఘటన  మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. నగరానికి చెందిన అరుణ్  కాప్సే అనే వ్యక్తి డోమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేశాడు. దాన్ని తింటుండగా కత్తి ముక్క రావడంతో భయపడిపోయాడు. అది తన కడుపులోకి వెళ్తే పెను ప్రమాదం జరిగేదని ఆందోళన చెందాడు. 

వెంటనే డోమినోస్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మొదటగా వారు ఈ విషయాన్ని తోసిపుచ్చారు. తర్వాత అరుణ్ ఇంటికి వచ్చి చూడగా నిజంగానే అందులో కత్తి ముక్క ఉండడంతో అతడికి క్షమాపణలు చెప్పారు. తాను పిజ్జాను రూ.596 పెట్టి ఆర్డర్ చేశానని, డోమినోస్ సంస్థ నిర్లక్ష్యం క్షమించరానిదని వాపోయాడు. మీరు ఆహారాన్ని ఆర్డర్ చేస్తే జాగ్రత్త వహించండి అంటూ సూచించాడు.