calender_icon.png 28 December, 2024 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోకాళ్ళపై కూర్చోని నిరసన

04-12-2024 08:16:37 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మద్యాహ్న భోజనం అందిస్తున్న వంట కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించి గౌరవ వేతనం ప్రతి నెల చెలించాలని కోరుతూ బుధవారం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు మద్యాహ్నం భోజన కార్మికులు మోకాళ్లపై కూర్చోని నిరసన తెలిపారు. ప్రభుత్వ వైకరిని నిరసిస్తు నినాదాలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు తమకు మాత్రం ప్రతి నెల బిల్లులు మాత్రం ఇవ్వకపోవడంపై వారు మండిపడ్డారు. 11 నెలల కోడి గుడ్ల బిల్లులు రావడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, ఉమా, ప్రమీల, లక్ష్మీ తదితరులు ఉన్నారు.