calender_icon.png 21 March, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యచేయడం కళగా భావించే కిల్లర్ ఆర్టిస్ట్

19-03-2025 12:00:00 AM

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘కిల్లర్ ఆర్టిస్ట్’. ఈ సినిమాను ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ..- “ఇండస్ట్రీలో నాకు మొదట అవకాశం ఇచ్చింది డైరెక్టర్ మారుతి.

ఆయన ఇచ్చిన ఆ చిన్న అవకాశం ఇప్పటికీ ఫ్యూయల్‌గా నన్ను నడిపిస్తోంది. మూవీ సక్సెస్ మీట్ కూడా తప్పకుండా పెడతాం” అన్నారు. హీరోయిన్ క్రిషేక పటేల్ మాట్లాడుతూ..- “కిల్లర్ ఆర్టిస్ట్’ సినిమా ద్వారా నేను టాలీవుడ్‌కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడ్డాం.  రిజల్ట్ మీ చేతుల్లో ఉంది” అన్నా రు. నటి సోనియా ఆకుల మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను కీ రోల్ చేశాను.

సినిమా స్టార్టింగ్, ఎండింగ్ నా క్యారెక్టర్‌తోనే జరుగుతుంది’ అన్నారు. డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ.. “ఆర్టిస్ట్’ సినిమాను సెన్సార్ వారి సూచన మేరకు ‘కిల్లర్ ఆర్టిస్ట్’ అని పెట్టుకున్నాం. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథ ఇది. ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ నుంచి ఈ కథ మొదలై రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది” అన్నారు.

ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ.. “చిత్రీకరణ చేస్తున్నంత వరకు బాగా రావాలని ప్రయత్నించాం. ఇప్పుడు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనే టెన్షన్ పడుతున్నాం. ఈ సినిమా ఫలితంపపై మా హీరో, హీరోయిన్స్, డైరెక్టర్.. ఇలా చాలా మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందరూ బాగా వర్క్ చేశారు” అన్నారు.