calender_icon.png 11 October, 2024 | 11:49 PM

ఎల్‌అండ్‌టీ చేతికి కీలక ఆర్డర్

01-10-2024 12:00:00 AM

ముంబయి: లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్‌అండ్‌టీ)సోమవారం దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌నుఅభివృద్ధి, అమలు చేయడానికి ఆర్డర్ పొందినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లోతెలిపింది. ఈ ఆర్డర్ ల్‌అండ్‌టీకి..పవర్ ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్‌కు సంబంధించిన అనుబంధ సంస్థ ’డిజిటల్ ఎనర్జీ సొల్యూషన్స్’ ద్వారా వచ్చింది.

ఈ ప్రాజెక్ట్‌లోఆంధ్రప్రదేశ్, కేరళ, పుడుచ్చేరి, తమిళనాడు, తెలంగాణాలలో ప్రాంతీయ/రాష్ట్ర లోడ్ డిస్పాచ్ కేంద్రాల కోసం వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు సంబంధించిన డిజిటలైజేషన్ మెరుగుపడుతుంది. డిజిటల్ ఎనర్జీ సొల్యూషన్స్ అనేది పవర్ సిస్టం నిపుణుల ప్రత్యేక సెటప్.

ఇది భారత్, మధ్యప్రాచ్యం, యూఎస్‌లో ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు సంబంధించిన డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడానికి అధునాతన గ్రిడ్ సేవలు, పవర్ కన్సల్టింగ్ సర్వీసెస్, సిస్టం ఇంటిగ్రేషన్ పరిష్కారాలను అందిస్తోంది.