calender_icon.png 14 November, 2024 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్ కేసులో కీలక పరిణామం

13-11-2024 12:49:19 AM

విచారణను మరో బెంచికి బదిలీ చేసిన సీజేఐ

న్యూఢిల్లీ, నవంబర్ 12: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఈ కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో కోర్టు కు మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటి షన్‌పై విచారించిన సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టి స్ సంజయ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధ ర్మాసనం విచారణను మరో బెంచికి మా ర్చిం ది. డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నే తృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు పంపాలని సుప్రీం రిజిస్ట్రీని ఆదేశించారు. 

మరో ధర్మాసనానికి బదిలీ..

వాస్తవానికి రఘురామ దాఖలు చేసిన పిటిషన్ సీజేఐ ధర్మాసనం ముందుకు విచారణకు వెళ్లింది. అయితే ధర్మాసనంలో జస్టిస్ సంజయ్‌కుమార్ సభ్యుడు కాగా విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని జగన్ తరఫు లాయర్ తెలిపారు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.

అయితే జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అన్నారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వం వహించే ధర్మాసనం ముందు కు పంపాలని ఆదేశాలు జారీ చేస్తూ.. డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదే శించారు. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తనముందు ప్రస్తావించవద్దని చెప్పా రు.. కానీ పొరపాటున ఇవాళ లిస్ట్ చేసినట్లు సీజేకి తెలిపారు.