calender_icon.png 4 March, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరపాలి

02-03-2025 11:57:19 PM

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి

పీడీఎస్‌యూ రాష్ర్ట ఉపాధ్యక్షుడు కిరణ్ 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి 2 : ఎస్‌ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలడం వల్ల టన్నెల్ లో పనిచేస్తున్న 6గురు కార్మికులు,ఇద్దరు ఇంజనీర్లు సొరంగంలోని ఇరుక్కపోయి ఊపిరాడక విగత జీవులుగా మారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కార్మికుని కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పీడీఎస్ యూ రాష్ర్ట ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం మండల కేంద్రం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకుల అసమర్ధత,నేటి పాలకుల నిర్లక్ష్యం,అధికారుల ముందు చూపు,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా 8మంది కార్మికుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై పూర్తి న్యాయ విచారణ జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.