తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల మహాధర్నా
హైదరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగుల పదో న్నతులపై న్యాయ విచారణ చేయాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను పక్కన, బీసీ, ఓసీ ఉద్యోగులకు నష్టం చేకూర్చేలా విద్యుత్ శాఖలో కండీషన్ల పేరిట ప్రమోషన్లు ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ట్రాన్స్ కో, జెన్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు విద్యత్ సౌధ ముందు ధర్నా చేపట్టారు. ఇతర సమస్యలను సైతం పరిష్కరించాలన్నారు.