calender_icon.png 19 April, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1 ఫలితాలపై న్యాయ విచారణ జరపాలి

15-04-2025 12:00:00 AM

అభ్యర్థులకు న్యాయం చేయాలి

నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన 

హైదరాబాద్‌సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి) : ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలపై సీబీఐ, న్యాయ విచారణ జరపాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. భార త రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్లకార్డులు , అంబేడ్కర్ చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం గ్రూప్  న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ వరుస హాల్ టికెట్ నంబర్ కలిగిన 68మందికి ఒకే విధం గా మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించా రు. రీకౌంటింగ్‌కు అప్లు చేయకున్నా వచ్చిన మార్కులను ఎలా తగ్గిస్తారన్నారు. ఉర్ధూమీడియంలో పరీక్ష రాసిన 9మందిలో ఏడుగురికి అత్యధిక మార్కులు రావడం అనుమానాలను కలిగిస్తోందన్నారు. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలను భయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో మహిళల కోసం సెంటర్ ఏర్పాటు చేయడంపై అనుమానాలున్నాయన్నారు. కా ర్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.