calender_icon.png 4 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవీణ్ పగడాల మరణంపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలి

02-04-2025 12:00:00 AM

డీబీపీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్

ముషీరాబాద్, ఏప్రిల్ 1: (విజయక్రాంతి): క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడా ల మరణంపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.

ఈ మేరకు మంగళవారం హిమా యత్ నగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాజమహేంద్రవరం సమీపాన మృతదేహాన్ని మార్చి 24న అక్కడి పోలీసుల స్వాధీ నం చేసుకున్నారని, పోస్టుమార్టం కూడా సక్రమంగా నిర్వహించలేదన్నారు.

ఇది యా క్సిడెంట్ కాదని, ముమ్మాటికి ముందస్తు ప్రణాళికతో ఉద్దేశపరంగా చేసిన హత్యేనని అన్నారు. ప్రవీణ్ పగడాలను విజయవాడలో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతనంగా చంపి రాజానగరం సమీపంలో రోడ్డు పక్కనే హంతకులు పడేసారని ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రవీణ్ పగడాల మృత దేహానికి తిరిగి రీ పోస్టు మార్టం నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు.

ఈ ఘటన పై విస్తృత స్థాయిలో విచారణ చేయడానికి రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత జ్యూడిషల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కృష్ణ స్వరూప్ కోరారు. కాషాయ మత ఉన్మాద శక్తులు చేస్తున్న దాడులను ప్రతిఘటించడానికి క్రైస్తవ దళిత సమాజం పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గోలి నరేష్. మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు అల్లం సురేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి సంకు శ్రీనివాసులు, పార్టీ నాయకులు చిప్ప రి సుబ్బారావు, మద్దెల ప్రవీణ్ కుమార్, పి. సుచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.