calender_icon.png 11 January, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయమూర్తి

10-01-2025 10:56:25 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి శుక్రవారం పాల్వంచలోని మూడు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవభారత్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల వసతిగృహం, ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహం, షెడ్యూల్ కులాల బాలుర వసతిగృహాలను తనిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రిన్సిపాల్, వార్డెన్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని తరగతి గదులు, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్‌లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార మెనూను పరిశీలించి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హాస్టల్ వార్డెన్‌ను సూచించారు. షెడ్యూల్ కులాల బాలుర వసతిగృహం, పాల్వంచలో ఆహారపు మెనూను సరిగా పాటించని సిబ్బందిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో న్యాయమూర్తితో పాటు సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.