05-02-2025 08:13:01 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి బుధవారం కొత్తగూడెంలోని నాలుగు వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాల బాలికల వసతి గృహము ఏ పవర్ హౌస్ బస్తీ, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఏ పవర్ ఆఫ్ బస్తి, సింగరేణి ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బీసీ బాలికల వసతి గృహము, ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహములను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని వార్డెన్స్ కు ఆదేశించారు.
ఈ సందర్బంగా వసతి గృహంలోని తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూమ్ లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహర మెనూను పరిశీలించి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని హాస్టల్ వార్డెన్ కు తెలిపారు. ఈ నాలుగు హాస్టల్స్ లలో ఆహారపు మెనును, సమయపాలన పాటించని సిబ్బంది పట్ల న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు. న్యాయమూర్తితో పాటు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు తనిఖీలో పాల్గొన్నారు.