15-04-2025 01:27:28 AM
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఏప్రిల్ 14:(విజయ క్రాంతి): భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా క్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్పూర్తితో భారతదే శం అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.
అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఫులాం గ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని బా బాసాహెబ్ అంబేడ్కర్ కన్న కలలను సాకా రం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఉద్బోధించారు. సామాజిక న్యాయంతో పాటు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చే స్తున్నామని అన్నారు.పుర ప్రముఖులతో కలిసి అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ, ఆ మహనీయుని ఆశయాల సాధ న కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హం దాన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ అన్ని వర్గాల వారికి హక్కులను కల్పిస్తు న్నాయని, భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు.
సమాన విద్య, సమానత్వ హక్కులు, ప్రాథమిక హ క్కులన్నీ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చినవే అని గుర్తు చేశారు. మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎటువైపు చూసినా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ము ద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఎలాం టి పక్షపాతం లేకుండా డ్రాప్టింగ్ కమిటీని రూపొందించడమే కాకుండా, ప్రాథమిక హ క్కులు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పా టు చేసి భారత రాజ్యాంగాన్ని 1950, జనవరి 26 నుండి అమలులోకి తీసుకువచ్చా రని అన్నారు. ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జి ల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమే ష్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
కామారెడ్డి, ఏప్రిల్ 14 ( విజయ క్రాంతి ), అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అదన కలెక్టర్ చందర్ నాయక్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న
బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు ప్రభుత్వం నెరవేర్చిందని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ పరిధి కేంద్రంలోని జిల్లా , అదనపు కలెక్టర్ చందర్ నాయక్ జిల్లా గ్రంధాలయ శాఖ చంద్రకాంత్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయల సాధనకు కృషి చేసి,
ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృతనిత్యంతో ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం పేదల ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వమని ఈ వర్గాలు ఆర్థికంగా ఎదగడం కోసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
అందరికీ న్యాయం జరిగేలా అంబేద్కర్ ఆలోచనల స్పూర్తితో ముందుకు సాగుతున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రిజర్వేషన్ ఫలాలు పదవులను అనుభవిస్తున్నామని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఎస్ సి కార్పొరేషన్ ఈ డి దయానంద్, టీఎన్జీ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, బహుజన సంఘ నాయకులు కొత్తపల్లి మల్లయ్య వివిధ సంఘాల నాయకులు చక్రధర్, దేవరాజ్, రాజ్యలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, సహాయ సంక్షేమ అధికారి వెంకటేష్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంక్షేమ అధికారులు కళాజాత బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.