- 29 పతకాలతో రికార్డు
- ఒలింపిక్స్‌తో పోల్చి చూస్తున్న జనాలు
- పారాలే నయం అంటూ కామెంట్లు
పారిస్ పారాలింపిక్స్‌లో భారత ప్రయాణం ముగిసింది. రికార్డు స్థాయిలో 29 పతకాలతో మనోళ్లు ప్రయాణం ముగించారు. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు కేవలం ఆరంటే ఆరు పతకాలు మాత్రమే సాధిస్తే పారాలు మాత్రం 29 పతకాలతో రికార్డు నెలకొల్పారు.
పారిస్: పారాలింపిక్స్ భారత అథ్లెట్ల ప్రయాణం ముగిసింది. 7 స్వర్ణాలతో సహా మనోళ్లు 29 పతకాలు సాధించారు. మొన్న ముగిసిన ఒలింపిక్స్‌కు, పారాలింపిక్స్‌కు కంపేర్ చేస్తూ నెటిజన్లు అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. పారాలు సాధించిన స్వర్ణాల సంఖ్యైనా మెయిన్ అథ్లెట్లు సాధించలేదంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. గత టోక్యో పారాలింపిక్స్‌తో పోల్చినా కానీ అప్పుడు 19 పతకాలు నెగ్గిన పారాలు 2024కు వచ్చేసరికి 29 పతకాలు నెగ్గి ఔరా అనిపించారు. అదే టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు నెగ్గిన మన అథ్లెట్లు నాలుగేళ్ల తర్వాత జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఆరంటే ఆరే పతకాలు నెగ్గి నిరాశపర్చారు.
నవదీప్‌కు స్వర్ణం
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ విభాగంలో భారత్‌కు చెందిన పారా అథ్లెట్ నవదీప్ స్వర్ణం దక్కించుకున్నాడు. 47.32 మీటర్ల త్రో విసిరిన నవదీప్ మొదట రజతం గెలుచుకున్నా కానీ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య రజతం కాస్త స్వర్ణంగా మారింది.
రజతం స్వర్ణం అయిన వేళ..
భారత జావెలిన్ త్రోయర్ నవదీప్‌కు మొదట రజత పతకం వచ్చింది. కానీ పసిడి పతకం నెగ్గిన ఇరాన్ ప్లేయర్ సదేగ్ వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడంతో పారాలింపిక్ కమిటీ అతడిపై వేటు వేసింది. దీంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. అతడు జాతీయ జెండాను కాకుండా వేరే జెండాను ప్రదర్శించడంతో పారాలింపిక్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
తొలి భారతీయుడిగా..
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన రణ్‌ధీర్ సింగ్ నియామకం అయ్యారు. 2021 నుంచి రణ్‌ధీర్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా సేవలందించాడు. భారత్ నుంచి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి వ్యక్తి రణ్‌ధీరే కావడం గమనార్హం.