20-03-2025 12:11:07 AM
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు
మెదక్, మార్చి 19(విజయక్రాంతి)ః మెదక్ జిల్లా జర్నలిస్టుల కల సాకారమైందని.. మెదక్ జిల్లా ప్రెస్ క్లబ్ నూతన భవనంను ప్రారంభించడం సంతోషకరమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని స్టేడియం దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ భవనాన్ని క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్, కార్యదర్శి ప్రసాద్ లతో పాటు సీనియర్ జర్నలిస్టులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించారు.
అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి, మెమోంటో తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ కల ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం సంతోషమన్నారు. జర్నలిస్టుల సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ భాద్యులు కామాటి కిషన్, నర్సింహా చారి, ఎ.చంద్రశేఖర్రావు, సంగమేశ్వర్, శంకర్ దయల్ చారి, శ్రీధర్, అశోక్, నాగరాజు, గోపాల్ గౌడ్, రామకృష్ణ, రాజగౌడ్, సందీప్, సిద్దేశం, రహమత్, రియాజ్, శేఖర్, రామకృష్ణ, కార్తిక్, మల్లికార్జున్, సుభాష్, అంజనేయులుతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.