calender_icon.png 2 April, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలపై ఓ జర్నలిస్ట్ బూతుపురాణం..

01-04-2025 04:37:43 PM

కేసు నమోదు చేయాలని మహిళల ధర్నా..

చిట్యాల (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పాటుపడాల్సిన ఓ జర్నలిస్ట్ ఏకంగా మహిళలపై బూతుపురాణం వినిపించడం జరిగింది. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిట్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం మండల కేంద్రంలో జర్నలిస్ట్ లు చలివెంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అయితే స్థానిక మహిళలు చిదరాల సరోజన, మైదం కరుణలతో పాటు పలువురు మహిళలు పబ్లిక్ టాయిలెట్స్ కావాలని, ప్రభుత్వం దవాఖానలో సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న వార్త విలేకరి కట్కూరి మొగిలి సదురు మహిళలను ఆకారణంగా నానా బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో సదురు మహిళలు వెంటనే చిట్యాల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పిర్యాదు చేసి రెండు రోజులు గడిచినప్పట్టికి పోలీస్ లు పట్టించుకోకుండా ఉండటంతో ఆగ్రహించిన మహిళలు మంగళవారం చిట్యాల సెంటర్ లో బైటాయించి ధర్నా చేశారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడారు. పవిత్రమైన జర్నలిజంలో ఉంటూ మండలంలో మొగిలి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ సమస్యలను ఎమ్మెల్యే కి చెప్పుకునేందుకు వెళ్లిన మమల్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు తిట్టడం జరిగిందని పేర్కొన్నారు. మొగిలిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అదేవిదంగా వార్త యాజమాన్యం సైతం మొగిలిపై చర్యలు తీసుకోవడంతో పాటు సంస్థ నుంచి తొలగించాలని కోరారు.