calender_icon.png 28 December, 2024 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

09-07-2024 02:54:58 AM

  • ఉరేసి.. తలపై పారతో బాది హత్య 
  • ఆ తర్వాత పురుగుల మందు తాగిన భర్త 
  • జగిత్యాల జిల్లాలో ఘటన 
  • గల్ఫ్ నుంచి వచ్చిన రోజే హత్య

జగిత్యాల, జూలై 8 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రా వుపేట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన భర్త భార్యపై అనుమానంతో స్వగ్రామానికి వచ్చిన రాత్రే భార్యను హత్య చేసి, ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడిపల్లి మండ లం తొంబర్రావుపేట గ్రామానికి చెందిన రాయంచి జల (38), రాయంచి లింగం దంపతులు. కొన్ని సంవత్సరాల క్రితం గల్ఫ్ కు వెళ్లిన లింగం ఆదివారం సాయంత్రమే స్వగ్రామానికి వచ్చాడు.

అదే రోజు రాత్రి భార్యపై  అనుమానంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జలకు ఉరేసిన లింగం.. చనిపోయిందో లేదో అనుకొని ఆ తరాత వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే పౌరతో జల తలపై బాదాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నా క లింగం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లింగంను స్థానికులు జగిత్యాల ప్రభుత ఆస్పత్రికి తరలించారు. కాగా లింగం, జల దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు వివాహం కాగా కొడుకు గల్ఫ్‌లోనే ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు కోరుట్ల సీఐ సురేష్‌బాబు తెలిపారు.