calender_icon.png 27 December, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందమంది మందలా వచ్చి వంద ప్రశ్నలు...!

04-12-2024 04:25:11 PM

గురుకులాల తనిఖీలో బీఆర్ఎస్వి అత్యుత్సాహం..

కమిటీ మేరకు నలుగురు మినహా అనుమతి లేకపోయినా మంద బలంతో బాలికల గురుకులంలోకి చొరబాటు. 

ప్రిన్సిపాల్ ను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించిన బిఆర్ఎస్వి నేతలు. 

అత్యుత్సాహంతో అబాసుపాలవుతున్న బిఆర్ఎస్ పార్టీ. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గురుకులాల తనిఖీల్లో బిఆర్ఎస్వి అత్యుత్సాహం ప్రదర్శించింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులల్లో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులకు గురుకులాల తనిఖీకి ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బిసి గురుకుల బాలికల పాఠశాలను బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నేతలు విష్ణుతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కల్పన, ఆరోవాడు కౌన్సిలర్ తేజ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తనిఖీలో పాల్గొన్నారు. కానీ పాఠశాల ప్రిన్సిపల్ పై అధికారుల అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయడంతో పాఠశాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది.

ఒకేసారి వంద మంది మందలా వెళ్లి సిబ్బందిని చుట్టు ముట్టి 100 ప్రశ్నలు ఒకేసారి వేయడంతో ఆమె కంగుతిన్నారు. డైనింగ్ హాల్, కూరగాయల గది, వంట సామాగ్రి గది, బియ్యం బస్తాల గదిని కూడా తనిఖీ చేశారు. వంట గదిలో ప్రిన్సిపాల్ లలిత కుమారి చుట్టి ముట్టి మహిళలు, యువకులు ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండానే గేటు తోసుకుంటూ లోపలికి వచ్చారని శుభ్రంగా ఉంచుకున్న వంట గదిలో చెప్పులు ధరించి అపరిశుభ్ర చేశారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బిఆర్ఎస్వి నేతలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై డిసిఓ ప్రశాంతిని వివరణ కోరగా తన నుండి జిల్లా కలెక్టర్ నుండి కానీ ఎవరు అనుమతి తీసుకోలేదని బదులిచ్చారు.