రూ.1300 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ సీఎండీ రఘుమారెడ్డి
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ సెక్రటరీ పవర్ కోటేశ్వర రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (విజయక్రాంతి) ః టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ మాజీ సీఎండీ రఘుమారెడ్డి భారీ కుంభకోణం చేశారని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ పవర్ కోటేశ్వర రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారమేనని స్పష్టం చేశారు.
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఆళ్ల రామకృష్ణ, ఏ. శంకర్, కె. శంకర్‌లతో కలిసి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ల కాలంలో అధోగతిపాలైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం కృషి చేస్తున్నట్టు చెప్పారు. 2014కు పూర్వం ఏ గ్రేడ్‌లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ.. సి గ్రేడ్‌కు దిగజారడానికి కారణం ఎవరని నిలదీశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు రూ. 1,63,583 కోట్లకు చేరడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో సీఎండీ రఘుమారెడ్డి రూ. 1300 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2017లో సికింద్రాబాద్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో 7 గురు ప్రాణాలు కోల్పోతే బాధ్యులపై ఎందు కు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది రాష్ట్రంలో గరిష్టంగా 15,623 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను అవలీలగా చేరు కున్నప్పటికీ, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట, మహబూ బ్ నగర్‌లోనూ విద్యుత్ సరఫరాలో అంతరా యం లేకున్నా.. ఉన్నట్టుగా చేస్తున్న అబద్ద పు ప్రచారాన్ని ప్రభుత్వం సాంకేతిక సాక్ష్యాధారాలతో సహా నిరూపించినట్టు తెలిపారు.