మనీలాండరింగ్ కేసులో విచారణ నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, నవంబర్ 20: ఎయిర్‌సెల్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్ ఒప్పందంలో ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు(ఎప్‌ఐపీబీ) అనుమతుల్లో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయంలో చిదంబరంతోపాటు ఆయన కుమారుడిపైనా కేసు నమోదైంది. ఈ కేసులో సీబీఐ, ఈడీ వేర్వేరుగా 2018లో చార్జిషీట్లను కూడా దాఖలు చేశాయి. దీంతో చిదంబరం ప్రమేయంపై విచారణ జరిపేందుకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.