calender_icon.png 11 April, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్‌కు భారీ ఊరట

21-03-2025 12:44:25 AM

‘మత విద్వేషాల కేసు’ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): మత విద్వేషాలు రెచ్చగొ ట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో పెద్ద ఊరట లభించిం ది. గురువారం ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

2020 నవంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భా గంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం లో ఓ వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చే శారంటూ సికింద్రాబాద్ మార్కె ట్ పీఎస్‌లో కేసు నమోదైంది.

తాజాగా ఈ కేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగ్గా.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారని వివరించారు. వాదనలు విన్న హైకోర్టు బండి సంజయ్‌పై కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.