21-02-2025 01:23:15 AM
మునుగోడు ఉప ఎన్నికల వేళ నమోదైన కేసు కొట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు భారీ ఊరట లభించింది. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆయనపై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టివేసింది.
2022లో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా నాటి సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ కేసీఆర్ యూజ్‌లెస్ ఫెలో, బీఆర్‌ఎస్ దండుపాళ్యం ముఠా అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.
ఆయన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది. అలాగే బండి సంజయ్‌పై 2021లో బీఆర్‌ఎస్ నేతలు చేసిన దూషణలకు నిరసనగా బంజారాహిల్స్‌లో ధర్నా చేసిన బీజేపీ నాయకులపై నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.