calender_icon.png 9 January, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్ కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం

08-01-2025 07:40:40 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విస్తృతంగా మంటలు చెలరేగడంతో రెస్టారెంట్ లో ఉన్న కస్టమర్లు, హోటల్ సిబ్బంది, బయటకు పరుగులు తీశారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్టారెంటులో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం పట్ల కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందని హోటల్ యాజమాన్యం తెలిపారు. ఈ ప్రమాదానికి షాక్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమనిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.