calender_icon.png 5 February, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

04-02-2025 08:57:52 PM

హైదరాబాద్‌: నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీ(chemical factory)లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న నాలుగు కంపెనీలకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ, రసాయనాల ఘాటు అలుముకోవడంతో పారిశ్రామిక ప్రాంతంలోని స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.