- 2 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం
- సమీప ప్రాంతంలో షాక్ వేవ్స్, దట్టమైన పొగ
- ధ్వంసమైన దుకాణాలు, వాహనాల అద్దాలు
- ఎన్‌ఐఏ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడి!
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల ఆదివారం ఉదయం భారీ శబ్దంతో బాం బు పేలుడు సంభవించడం సంచలనం సృష్టించింది. ఈ శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
పేలు డు నుంచి వచ్చిన షాక్ వేవ్స్‌తో పక్కనే ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యా యి. పలు దుకాణాలు, నిర్మాణాలు దెబ్బతిన్నా యి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. పేలుడులో ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో ఒక తెల్లని పౌడర్ వంటి పదార్థాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), పలు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఐఏ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సమీప ప్రాంతంలో షాక్ వేవ్ ప్రభావాన్ని సృష్టించే విధంగా పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు గుర్తించినట్లు సమాచారం.
షాక్‌వేవ్‌తో బెదిరింపు కోసమే..!
విచారణలో వెల్లడైన ప్రాథమిక సమాచా రం ప్రకారం.. పేలుడులో ఘన లేదా ద్రవ పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ఇవి కొన్ని సందర్భాల్లో అధిక వేడి, దట్టమైన, అధిక పీడ నం కలిగిన వేవ్‌ను సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేలుడు ద్వారా వచ్చిన పదార్థాలు మొదట గాలిలోకి చాలా వేగంగా విస్త రించి, ఆ ఒత్తిడి ప్రతిచర్య ద్వారా షాక్ వేవ్స్ ఏర్పడుతాయని పేర్కొన్నారు.
ఈ షాక్ వేవ్స్ వల్ల హైప్రెజర్‌తో గాలి బయటికి వచ్చి సూపర్‌సోనిక్ వేగంతో భవనాలు, వాహనాల అద్దా లను దెబ్బతీస్తుంది. కాగా, పేలుడు ప్రాంతంలో ఎలాంటి మెటల్, బాల్ బేరింగ్స్, మేకులు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు గు ర్తించలేదు.
ఈ ప్రాంతంలోని దుకాణదారుల ను బెదిరించేందుకు ఈ పేలుడు జరిపారని అ ధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీ సుల నుంచి కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది.
పాత ముంబైలా నేటి ఢిల్లీ: ఆతిశీ
దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నా పట్టించు కోవడం లేదని ఢిల్లీ సీఎం ఆతిశీ మర్లెనా ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్ స్కూల్ బయట పేలు డు ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో తెలియజేస్తోందని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కానీ, ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకోవడంలో మాత్రం పూర్తిగా నిమగ్నమైందని విమర్శించారు. అం దువల్లనే ఒకప్పటి అండర్ వరల్డ్ ముంబై తరహాలో ఢిల్లీ పరిస్థితి మారిందని అన్నారు. గ్యాం గ్‌స్టర్లు బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, వీటిని నియంత్రించే సామర్థ్యం బీజేపీకి లేదని విమర్శించారు.
పొరపాటున వారిని ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కాగా, ఆతిశీ ఆరోపణలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆమె తోలుబొమ్మ సీఎం అని, సమస్య పరిష్కారం గురించి కాకుండా ఈ సమయంలో రాజకీయాలు సరికాదని సూచించింది.