calender_icon.png 31 October, 2024 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు

30-07-2024 12:00:49 AM

నలుగురు వ్యక్తులు దుర్మరణం 

శ్రీనగర్, జూలై 29 : జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఓ స్క్రాప్ డీలర్ ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలు దించుతున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించగా.. నజీర్ అహ్మద్ నద్రో, అజీమ్ అష్రఫ్ మీర్, ఆదిల్ రషీద్, మహ్మద్ అజార్ అనే నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.