calender_icon.png 17 January, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..

16-01-2025 08:47:21 PM

12 మంది మావోయిస్టులు మృతి..

భారీ మందు గుండు సామాగ్రి స్వాధీనం..

చర్ల (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని బీజాపూర్ అడవు(Bijapur forest)ల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లోని మూడు జిల్లాల మావోయిస్టులపై సైనికులు భారీ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్‌జీ బీజాపూర్‌(DRG Bijapur), డీఆర్‌జీ సుక్మా(DRG Sukma), డీఆర్‌జీ దంతేవాడ(DRG Dantewada), కోబ్రా(Cobra) 204, 205, 206, 208, 210, కారిపు 229 బెటాలియన్‌ల సంయుక్త బృందం పనిచేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి భద్రతా బలగాలు(Security forces), నక్సలైట్ల(Naxalites) మధ్య అడపాదడపా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక SLR, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లోని ఈ ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్ సైనికులు(Greyhounds Soldiers) కూడా పాల్గొంటున్నారు. బీజాపూర్‌లోని మరుద్‌బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో ఉదయం 09:00 గంటల నుండి భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య అడపాదడపా ఎదురు కాల్పులు జరుగుతున్నాయని సమాచారం. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం ముగ్గురు మావోయిస్టులను భద్రత బలగాలు హత మార్చిన విషయం విధితమే. ఇటీవల నేషనల్ పార్క్(National Park) ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టుల ఉనికిని గుర్తించడం గమనార్హం. సమాచారం అందుకున్న భద్రతా దళాల బృందాన్ని సెర్చ్ ఆపరేషన్ కోసం పంపించారు. సెర్చ్ ఆపరేషన్(Search Operation) సందర్భంగా ఆదివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు హతమైన విషయం తెలిసిందే...