calender_icon.png 15 November, 2024 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్‌లో భారీ భూకంపం

09-08-2024 01:01:57 AM

రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదు

సునామీ హెచ్చరికలు జారీ

జపాన్, ఆగస్టు 8: జపాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీర ప్రాంతంలోని క్యుషు ద్వీప సమీపంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని జపాన్ వాతవరణ శాఖ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైందని తెలిపింది. తీవ్రత అధికంగా ఉండటంతో సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ప్రభావిత ప్రాంత ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని సూచించారు. క్యుషు, షికో ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. భూకంపం ధాటికి సమీపంలోని విమానాశ్రయ అద్దాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.