24-02-2025 08:46:08 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం చింతల్లంక పంచాయతీ రాజుతండాలో సోమవారం ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం... మెంతెన శేషగిరి అనేవ్యక్తి ఆర్ఎంపి వైద్యుడు సొంత పనుల నిమిత్తం భార్య, భర్తలు ఇద్దరు వేరే ఊరెళ్ళారు. ఇంటికి తాళం వేసిన ఇంటిలో తాళం పగలగొట్టకుండానే చోరీకి పాల్పడ్డారు. ఇంటి వెనుకాల నుంచి మెస్ డోర్ పగలగొట్టి, తలుపు గడియ తీసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, రూ.70 వేల నగదు అపహరించారని బాధితులు తెలిపారు. విషయాన్నీ తెలుసుకున్న ఇంటి యజమాని శేషగిరి భార్య శ్వేత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగతనంపై విచారణ చేపట్టారు. సంఘటన ప్రదేశానికి క్లూస్ టీమ్ చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు.