ఏడుగురు నిందితుల అరెస్టు
చార్మినార్, సెప్టెంబర్ 25: కాఫీ షాపు ముసుగులో ఓ వ్యక్తి హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ షాపుపై దాడి చేయగా హుక్కా సామగ్రితో పాటు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాస్‌రావు ఈ మేరకు మీడియా సమావేశం లో వివరాలు వెల్లడించారు.
తాడ్‌బన్‌లో మొహమ్మద్ అబ్దుల్ ముజమ్మిల్ (26) కొన్నాళ్లుగా ది వోల్ఫ్ కేఫ్ అండ్ లాంజ్ కాఫీ షాపు పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇదే షాపులో గుట్టుచప్పుడు కాకుండా చట్టవిరుద్ధంగా హుక్కా సెంటర్‌ను కూడా నడుపుతున్నాడు.
ఈ హుక్కా సెంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో దాడిచేసి ముజమ్మిల్‌తో పాటు హుక్కా సెంటర్ మేనేజర్ మొహమ్మద్ పుర్ఖాన్ అహ్మద్ (18), హుక్కా సప్లయర్ మొహమ్మద్ నజీర్(41), వినియోగదారులు సయ్యద్ జమీర్(25), సయ్యద్ సోహైల్ (20), సయ్యద్ ఫజల్ (20), మొహమ్మద్ ముక్రం (20ను అరెస్ట్ చేశారు.
అలాగే హుక్కా కుండలు 19, హుక్కా రుఉలు 5బాక్స్‌లు, హుక్కా కాయిల్స్ 6బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడి సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర బృందాన్ని డీసీపీ అభినందించారు. కేసును బహదూర్‌పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.