calender_icon.png 15 March, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందాన్ని నింపిన హోలీ

15-03-2025 12:56:31 AM

జగిత్యాల, మార్చి14(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ బిఎస్ లత పలువురు ఉద్యోగ సంఘాల నాయకుల జిల్లా అధికారులతో ఘనంగా హోలీ పండుగను   ఘనంగా జరుపుకున్నారు వేడుకల్లో కలెక్టర్  సత్య ప్రసాద్ ఐఏఎస్   పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంపీ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు 

కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి): నగరంలోని చైతన్యపురి లో గల ఎంపీ కార్యాలయంలో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి, బిజెపి,నాయకులు,కార్యకర్తలు పాల్గొని సంబరాలు ఘనంగా నిర్వహించారు.

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో హోలీ వేడుకలలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్.

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో..

గోదావరిఖని మార్చి14(విజయ క్రాంతి) రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను  పురస్కరించుకొని,  కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కి రంగులు పూశారు. ఈ సందర్బంగా సీపీ అధికారులు,సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు, బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, అందరు ఆనందం తో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేసారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లువిరియాలని, ఈహోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని తెలిపారు.

ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిప్ ఎ,బాస్కర్,  అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి  రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్ , ట్రాఫిక్ ఎసిపి నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఎసిపి మల్ల రెడ్డి , ఇన్స్సె్పక్టర్లు, ఆర్.ఐలు, సిసి హరీష్, ఎస్.ఐ, ఆర్ ఎస్‌ఐ లు  ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టవర్ సర్కిల్లో బిజెపి శ్రేణుల హోలీ సంబరాలు...

కొత్తపల్లి, మార్చి14 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం లోని టవర్ సర్కిల్లో బిజెపి శ్రేణులు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతలు బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్ లు మాట్లాడుతూ ఈ హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని శక్తిని నింపాలని, ప్రజల్లో ఐక్యత రంగులు వేల్లి విరియాలన్నారు.

రంగులతో నిండిన ఈ హోలీ పండుగ జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని  తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు నాంపల్లి శ్రీనివాస్ ,  ఉప్పరపల్లి శ్రీనివాస్, పొన్నాల రాము, అరవింద్, భరత్ పర్వతాల మల్లేశం, హరీష్, సమరసింహారెడ్డి, శంకు, అల్లంకి సంతోష్  పాల్గొన్నారు.

హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి 

కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి): హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే  డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట ఎల్‌ఎండి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నాయకులు కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లుకున్నారు.

ఉత్సాహంగా పాటలకు స్టెప్పులు వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

నగరంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, కాంగ్రెస్ నాయకుడు వి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రంగుల పండుగ అయినా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.

బాలసదనం చిన్నారులతో.

జగిత్యాల అర్బన్, మార్చి 14 (విజయక్రాంతి): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలసదనం చిన్నారులతో జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత హోలీ సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలపగా పిల్లలకి మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్, బాల సదనం ఉద్యోగులు మమత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.