ప్రొఫెసర్ హరగోపాల్
రంగారెడ్డి, డిసెంబర్1 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ అధిక కేటాయింపులు చేపట్టాలని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన డీటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభకు హరగోపాల్ హాజ రై మాట్లాడారు.
గత పాలకులు చేసిన విధంగానే నేటి పాలకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దూర దృష్టిలేకుండా తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా నిరుపేదలు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది పాఠశాలకే పరిమితం కాదని సామాజిక బాధ్యతలో ఉపాధ్యాయులు పాత్రధారులు కావాలన్నారు.