calender_icon.png 25 April, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగవైకల్య కుటుంబానికి చేయూత ఆపన్న హస్తం...

24-04-2025 08:28:08 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడుతున్న దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామపంచాయతీ పెద్ద బండి రేవు గ్రామానికి చెందిన సోయం రాము అనే వికలాంగుడికి గురువారం బుర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ఆపన్న హస్తం అందించారు.

అంగవైకల్యంతో బాధపడుతున్న రాము తల్లి సావిత్రి అనారోగ్యంతో మరణించి తండ్రి సత్యం కరోనా సమయంలో మరణించడంతో తొడబుట్టిన అక్క సమ్మక్క అన్ని తానే ఆలనా పాలన చూసుకుంటుందని అలాంటి కుటుంబం కేవలం అంగవైకల్యంతో బాధపడుతున్న రాముకు నెల నెల వచ్చే పింఛన్ పైనే జీవనం సాగిస్తుండగా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో చేయూత ట్రస్ట్ దృష్టికి రాగానే రూ.8 వేలు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, చేయూత ట్రస్ట్ చైర్మన్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కైపు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జెక్కిరెడ్డి మల్లారెడ్డి, సహాయ కార్యదర్శి గాది నర్సిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.