ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతికి కోతి కారణం
చేర్యాల (విజయక్రాంతి): విధులకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోవడానికి కోతి కారణం. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన పర్పటకం ధర్మారెడ్డి ఇదే మండలంలోని చూంచనకోట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి హెల్మెట్ ధరించి స్కూటీపై బయలుదేరాడు. చూంచనకోట శివారులో తన స్కూటికి కోతి అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయినప్పటికి కోతి స్కూటి మధ్యలో ఇరికి కిందపడటంతో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హెల్మెట్ ధరించిన ఉపాధ్యాయుని ప్రాణం కపడలేకపోయింది. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. వేచరేని గ్రామానికి చెందిన విధి నిర్వహణలో భాగంగా స్కూటీపై చుంచనకోట వైపు వెళ్తుండగా మార్గమధ్యమంలో కోతి అడ్డం వచ్చి స్కూటీ ముందు భాగంలో ఇర్కోగ స్కూటీపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.