24-03-2025 12:00:00 AM
జిన్నారం (గుమ్మడిదల), మార్చి 23: గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డ్ వద్దని మనోవేదనకు గురైన ఒక వ్యక్తి గుండె ఆగిపోయింది. మండలంలోని నల్లవల్లికి చెందిన నడిమింటి కృష్ణ (53)అనే వ్యక్తి హార్ట్ ఎటాక్ వచ్చి మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా మృతుడు డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు.
రజ క సంఘం తరఫున రిలే నిరాహార దీక్షలో సైతం పాల్గొన్నాడు. కాగా ఇటీవల డంప్ యార్డు పై తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఉదయం ఏడుస్తూ ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో హుటాహుటిన నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే హార్ట్ ఎటాక్ తో మరణించాడు. ప్రభుత్వం భాడుతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు.