calender_icon.png 3 April, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే గర్భస్థ శిశువుకు మేలు

27-03-2025 12:25:00 AM

గర్భిణీలకు అవగాహన కల్పించిన రామకృష్ణ మఠం వైద్యులు    

గజ్వేల్, మార్చి26: తల్లి మానసిక శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే గర్భస్థ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతుందని ఆర్య జనని ట్రస్ట్ వైస్ చైర్మన్ పీడియాట్రిక్ డాక్టర్ అనుపమ రెడ్డి అన్నారు. పుట్టే పిల్లలు సంపూర్ణమైన మానసిక వికాసంతో పాటు శారీరక ఆరోగ్యం  పొందడానికి తల్లి యొక్క ఆరోగ్య మానసిక పరిస్థితులు కారణం అవుతాయన్న అంశంపై రామకృష్ణ మఠం అనుబంధ సంస్థ అయిన ఆర్య జనని ట్రస్ట్,గజ్వేల్ హైందవ సోదరులు,  ఆపన్న హస్త మిత్ర బృందం సౌజన్యంతో  గర్భిణీలకు బుధవారం గజ్వేల్ లోని కోలాభిరామ్ గార్డెన్ లో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనుపమ కేర్ మాట్లాడుతూ  గర్భంలోని శిశువును తల్లి ఆలోచనలు, చేసే పనులు మాట్లాడే మాటలు మానసిక స్థితి ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయ న్నారు. గర్భంలోని శిశువుకు అనుభవమయ్యే పరిస్థితిలే తర్వాత శిశు వ్యక్తిత్వాన్ని గుణ సంపదను నిర్ణయిస్తాయన్నారు. సంస్కారవంతులైన దైవం పట్ల భక్తిశ్రద్ధలు కలిగిన తల్లులు ఉన్న ఇండ్లలోనే ఉన్నతమైన వ్యక్తులు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పారన్నారు.

తల్లి భావోద్వేగాలు సంరక్షణ అంతులేని ఆనందం గర్భస్థ శిశువు యొక్క హృదయం మనసు పూర్తి వికాసం చెందడానికి ఉపకరిస్తాయన్నారు. సంతులనమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతారన్నారు.

చక్కని నడవడిక, మంచి అలవాట్లు, గర్భం దాల్చిన మహిళలు  ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడవద్దని, భవిష్యత్తులో బిడ్డ ఏ స్థాయిలో ఎదగాలనుకుంటుందో తల్లి ఆయా రంగాలకు సంబంధించిన అంశాలను వినడం అలవాటు చేసుకోవాలన్నారు.

కార్యక్ర మంలో సిడిపిఓ వసంత,గజ్వేల్ పట్టణానికి చెందిన గైనకాలజీ వైద్యులు డాక్టర్ నాగ మున్నయ్య, డాక్టర్ శైలజ, డాక్టర్ పద్మాజ్యోతి, డాక్టర్ మంజుల, డాక్టర్ మంజుల  తదితరులు గర్భిణీలకు వైద్య సలహాలు సూచనలు చేశారు. ఆర్య జనని  యోగ మాస్టర్ మాధవి గర్భిణీలు చేయాల్సిన యోగాసనాలను వివరించగా ఆరోగ్య సలహాదారు నిహారిక, ఆహారం, నడవడిక తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో  జిల్లా మహిళా సంక్షేమ శాఖ జెండర్ కోఆర్డినేటర్ పద్మ, రామకృష్ణ మఠం ప్రతినిధి దశరథ, హైందవ సోదరులు,ఆపన్న హస్తం మిత్ర బృందం,  గర్భిణీలు అంగన్వాడి సిబ్బంది ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన  కోలాభిరామ్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డికి ఈ సందర్భంగా సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.