calender_icon.png 21 April, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారిలేని ఆరోగ్య కేంద్రం!

21-04-2025 12:10:54 AM

  1. అసైన్డ్ భూముల్లో అక్రమార్కుల పాగా 
  2. ఆరోగ్య కేంద్రానికి వెళ్ళే దారి మాయం?
  3. అధికారుల ఉదాసీన వైఖరితో ప్రజలకు ఇక్కట్లు

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): పిల్లి గుడ్డిదైతే... ఎలుక ఎక్కిరిం చింది అన్న చందాన ఉంది పాల్వంచ రెవె న్యూ అధికారుల పనితీరు. ఒకవైపు ప్రభు త్వం, ప్రభుత్వ భూమి గజం కూడా ఆక్రమణకు గురి కావద్దని పదేపదే ఒకఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారులకు చెవికి ఎక్కడం లేదు.

దీంతో అక్రమార్కులు రాజ్య మేలుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో గల ప్రభుత్వ సర్వే నెంబర్లు, 99 9,444,727,817 సర్వే నెంబర్లలో, అసైన్మెంట్ భూముల్లో  బై నెంబర్లు వేసి, సంబంధం లేని హద్దులను చూపి దర్జాగా రిజిస్ట్రేషన్ తో హక్కులు పొందుతున్నారు.

అదే క్రమంలో పట్టణ వెంగళరావు కాలనీ--ప్రశాంత్ నగర్ కాలనీల మధ్య గల ఎస్త్స్రన్మెంట్ భూమి 727 / 24 లో కాంపల్లి జనార్దన్ రావు పేరుతో 4 ఎకరాలకు తాత్కాలిక ఎస్త్స్రన్మెంట్ పట్టా ఉంది. అసైన్మెంట్ భూముల్లో క్రయవిక్రయాలు నిర్వహించడం చట్టపరంగా నేరం.

అతను తాత్కాలిక పట్టా భూమిలో శాశ్వత వెంచర్లు చేసి 2008 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాడు. అక్రమ రిజిస్ట్రేషన్ లపై అధికారుల కు అంధినా ఫిర్యాదుల మేరకు 2017లో అప్పటి రెవెన్యూ అధికారి గన్యా నాయక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అట్టి భూమిలో నిర్మించిన రేకుల షెడ్లను తొలగించడం జరిగింది.

రేకుల షెడ్లను తొలగించిన అధికారి అట్టి భూమిని పరిరక్షించడంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. ఆ తర్వాత వచ్చినా రెవెన్యూ అధికారులపై రాజకీయ ఒత్తిడి కారణంగా ఆట్టి భూమిని పరిరక్షించలేకపోయారు. దీంతో అక్రమార్కులు తిరిగి ఆ భూమిలో క్రయ విక్రయాలు ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం 2021లో అదే సర్వే నెంబర్లు 450 అడుగుల భూమిని పట్టణ ఆరోగ్య కేంద్రానికి రెవెన్యూ అధికారులు కేటాయించారు.

ఆసుపత్రి నిర్మాణానికి వైద్య ఆరోగ్యశాఖ రూ 18 లక్షల నిధులను కేటాయించారు. ప్రస్తుతం ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావస్తోంది. ఆస్పత్రికి వెళ్లడానికి మాత్రం రోడ్డు సౌకర్యం లేకపోవడం శోచనీయం. వాస్తవంగా ఆసుపత్రి లాంటి ప్రాముఖ్యత కలిగిన భవనాలకు అధికారులు రోడ్డు పక్కన స్థలాన్ని కేటాయించడం ఆనవాయితి.

అలాంటిది వెంగళరావు కాలనీలో పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెనక ప్రాం తంలో స్థలాన్ని కేటాయించడం రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. రూ 18 లక్షలతో ఆసుపత్రి నిర్మించిన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రోగులు ఆసుపత్రికి ఎలా వెళ్తారు, ఆంబులెన్స్ లాంటి వాహనాలు ఎలా నడుస్తాయని జంట కాలనీల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఆనాడు రెవెన్యూ అధికారి కాపాడిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు. అసైన్మెంట్ భూముల్లో వారసులు అనుభవించే హక్కు తప్ప క్రయవిక్రయాలు చేయరాదని చట్టం చెబుతున్న దర్జాగా రిజిస్ట్రేషన్లు చేయడం నిర్మాణాలు జరగటం గమనారహం. రెవెన్యూ మంత్రి పదే పదే ప్రభుత్వ భూములను కాపాడాలని ఆదేశాలు జారీ చేస్తున్న పాల్వంచ రెవెన్యూ అధికారులు  ఆదేశాలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.