23-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాం తి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎదుగుదల ఎంతో గొప్పగా ఉండబోతోంద ని ప్రముఖ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్-2050పై అధ్యయనం చేసిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంట ర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్‌వైఎస్‌ఈఏ) ఓ నివేదికలో కీలకమైన అంశాలు వెల్లడించింది.
హైదరాబాద్‌కు వివిధ రాష్ట్రాలు, ప్రాం తాల నుంచి వచ్చి స్థిరపడుతున్న వారితో మహానగరం వేగంగా విస్తరిస్తోంది. గత ఆరేళ్లలో 1.90 లక్షల గృహాలు అమ్ముడుపో యాయి. 2024 చివరి త్రైమాసికం నాటికి నగరంలో గృహాల సంఖ్య 4.60 లక్షల యూనిట్లకు చేరుకుంది. ఇది దేశంలోని మొత్తం ఇండ్లలో 11శాతం కావడం గమనా ర్హం.
ఇక దేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)కి హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రంగా మారి పోయింది. నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభించడం వల్లే జీసీసీలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి.
ప్రీమియం ప్రాజెక్టుల్లో 2030 నాటి కి హైదరాబాద్ కార్యాలయాల స్థలాలకు డిమాండ్ భారీగా పెరిగి 200 మిలియన్ చదరపు అడుగులను దాటనుందని హెచ్‌వైఎస్‌ఈఏ నివేదిక వెల్లడించింది. ఇది వాణి జ్య రియల్ ఎస్టేట్ రంగంలో 1.5 శాతం వృద్ధికి మార్గం సుగ మం చేయనుంది.
హైదరాబాద్‌లో హౌసింగ్ మార్కెట్ ట్రెండ్
* మిడ్-ఎండ్ హౌసింగ్ విభాగం: రూ. 45 లక్షల కంటే తక్కువ ధర గల ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి.
* హై- ఎండ్ సెగ్మెంట్: రూ.45 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ధర ఉన్న ప్రాపర్టీస్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.
* ప్రీమియం విభాగం: రూ.2కోట్ల నుంచి రూ.4 కోట్ల శ్రేణిలోని ఇళ్లు ఉన్నతస్థాయి జీవనం కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
* లగ్జరీ విభాగం: రూ.4 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తులు కూడా స్థిరంగానే విస్తరిస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్-2050 ముఖ్యాంశాలు
హెచ్‌వైఎస్‌ఈఏ నివేదిక ప్రకారం.. రాబోయే 25 ఏళ్లలో హైదరాబాద్ మహానగరం విస్తరణ భారీగా ఉండబోతోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రభుత్వ పెట్టుబడులు, వ్యూ హాత్మక నగర అభివృద్ధి కార్యక్రమాలపై మాస్టర్ ప్లా-2050 ఫోకస్ చేస్తుంది. ఆ వివరాలివి..
* రూ.1లక్ష కోట్ల మౌలిక సదుపాయాల పెట్టుబడి: హైదరాబాద్ నగరా భివృద్ధిని మెరుగుపర్చేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పెట్టుబడి దోహదం చేయనుంది.
* హైదరాబా ద్- ముంబై హైస్పీడ్ రైల్: దేశ ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు 767 కి.మీ హైస్పీడ్ రైలు కారిడార్ ఉపయోగపడనుంది.
* హైదరాబాద్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ హైవే: ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో భారత్‌మాల పరియోజన ద్వారా మొదటి దశలో భాగంగా 713 కి.మీ. మేర ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తారు. ఫలితంగా సౌత్ నుంచి హైదరాబాద్ మీదుగా రోడ్ కనెక్టివిటీ ఎంతో మెరుగవుతుంది.
* ఔటర్ రింగ్ రోడ్ వాటర్ సప్లు స్కీం (ఫేజ్-2): రోజుకు 137 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు ఈ పథకం ఎంతో కీలకమైంది. 2,865 కి.మీ. మేర వేసే పైప్‌లైన్ ద్వారా మెరుగైన తాగునీటిని సరఫరా చేయనున్నారు.
* మెట్రో రైల్ విస్తరణ: కొత్తగా ఆరు కారిడార్లలో 116 కి.మీ మేర మెట్రో విస్తరణ ద్వారా నగరంలో దాదాపుగా ఎక్కడి నుంచైనా మరో ప్రాంతానికి అత్యంత సులభంగా చేరుకునే వీలవుతుంది.
* మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు: చారిత్రక నగరమైన హైదరాబాద్ పునరుజ్జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైంది. పర్యాటక రంగాన్ని సైతం అభివృద్ధి చేయడం వల్ల ఆర్థికంగా నగరం అవకాశాలను కల్పిస్తుంది.
* ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు: ప్రస్తుతం ఉన్న నగరంలో ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా విస్తరణ జరిగిపోయింది. కొత్తగా నగరంలో విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను ఆనుకుని ఓ కొత్త నగరాన్ని రూపొందించే ప్రాజెక్టే ఫ్యూచర్ సిటీ. 30వేలకు పైగా ఎకరాల్లో అత్యత్భుతంగా తీర్చిదిద్దనున్న ఈ కొత్త నగరం విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలకు కేరాఫ్‌గా నిలవనుంది.
* స్మార్ట్ సిటీ అభివృద్ధి: హైదరాబాద్‌ను టెక్నాలజీ ఆధారిత స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఐవోటీ, ఏఐ వంటి రంగాల్లో నగర జీవన విధానం మరింత సులువవుతుంది.
గ్లోబల్ రియల్ ఎస్టేట్ కేంద్రంగా..
2050 మాస్టర్ ప్లాన్ సహా అనేక కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగరం ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగానికి చక్కని కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి, అనేక మార్గాల ద్వారా కనెక్టివిటీ, జీవన ప్రమాణాల మెరుగుదల ఇలా అనేక అంశాల్లో హైదరాబాద్ ఉత్తమంగా నిలిచి దేశంలో పెట్టుబడులకు ఓ చక్కని కేంద్రంగా మార్చేస్తున్నాయి.
నగరంలో కొత్త ప్రాజెక్టులు విస్తరిస్తున్న కొద్దీ హైదరాబాద్ తన ప్రత్యేకతను పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పెట్టుబడిదారులకు, స్థిరపడాలని కోరుకునే వారికి హైదరాబాద్ ఓ భూతల స్వర్గంగా కనిపిస్తోంది.