calender_icon.png 30 November, 2024 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామరస్య జీవనమే శరణ్యం

30-11-2024 12:00:00 AM

భారతదేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సహనానికి మారుపేరు. హిందువులలో కొందరు అతివాదులు లేకపోలేదు. అలాగని, మొ త్తం భారతీయ హిందూ సమాజాన్ని మతతత్తాన్ని రెచ్చగొట్టేదిగానో, రెచ్చిపోయేది గానో చిత్రీకరించలేం. కొన్ని పరిస్థితులలో రెచ్చగొట్టినప్పటికినీ భారతదేశంలోని 80 శాతం జనాభాలో ఎక్కువమంది హిందువులు అలాంటి పరిస్థితులకు లొంగి పోలే దన్నది చారిత్రక సత్యం. ఇంకా, గమనించదగ్గ విషయం ఏమిటంటే, సాధారణ హిం దువులు దేశంలోని ముస్లింల పట్ల లేదా మరే మైనారిటీ వర్గం పట్ల అయినా ఎ లాంటి శత్రుత్వాన్ని కలిగి ఉండడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో హింసకు గురైన అనేక సామాజిక వర్గాల ను భారతదేశం అక్కున చేర్చుకున్నది, ఇం కా చేర్చుకుంటూనే ఉన్నది. అలాంటి వా రెందరో మన దేశంలో ఆశ్రయం పొం దారు. విభిన్న విశ్వాసాలపట్ల భారతదేశంలోని మెజారిటీ హిందువులు ఎంతో గొ ప్ప సహనాన్ని, శాంతిని, ఆదరణను చూ పారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మేధావులు గుర్తించారు కూడా. సుమారు 11వ శతాబ్దం క్రితం ఇరాన్‌లో ఇస్లామిక్ పీడన నుంచి పార్సీలు పారిపోయి, భారతదేశానికి వచ్చారు.

ఆనాడు వారికి ఇక్కడ లభించిన ఆదరణ సామాన్యమైంది కాదు. అప్పటి పార్సీలు తమకు ‘స్వర్గధామం భా రతదేశమే’ అని భావించారు. వారి విశ్వా సం తరతరాలుగా ఇప్పటికీ చెక్కు చెదరలే దు. పార్సీలు కూడా ఈ నేలను తమదిగానే భావిస్తూ, ఆదర్శవంతమైన పౌరులు గానే ఉన్నారు, ఇంకా ఉంటున్నారు కూడా. అప్పట్నుంచీ మన దేశాభివృద్ధికి పార్సీలు సంఖ్యకు, ఇంకా శక్తికి మించి సహకరిస్తున్నారని చరిత్రకారులు ప్రశంసిస్తారు.

చాలామంది ఈ తరం వారికి తెలియని విషయం ఏమిటంటే, ఇటీవలె కన్నుమూసిన మార్గదర్శక శిఖామణి రతన్ టాటా ఆనాటి ఆదర్శ పార్సీల వారసులలో ఒకరే. ఇంకా దాదాబాయి నౌరోజీ నుంచి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా వరకు అనేకమంది ప్రముఖులు ఇక్కడి ప్రజలతో మమేకమైన పార్సీలే.

ఇదే పద్ధతిలో క్రీస్తు జన్మించిన కాలంలోనే క్రైస్తవులు భారతదేశానికి వచ్చినట్టు చరిత్ర ఉంది. వారికి మలబారు తీరంలో మన దేశీయులే స్వాగతం పలికారు. కాలక్రమంలో వారు కేరళ తదితర ప్రాంతాల లో తమవైన చర్చీలు, విద్యాసంస్థలను స్థా పించుకున్నారు. వీరు సైతం పార్సీల మా దిరిగానే దేశాభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అప్పట్లోనే యూరప్, మధ్య ప్రాచ్యంలోని హింసనుంచి పారిపోయిన యూదులు కూడా భారతదేశంలోని దక్షిణాది ప్రాంతాలలో ఆశ్రయం పొందారు.

ముస్లింలు, క్రైస్తవులతో కలిసి అధిక సం ఖ్యాకులైన హిందువుల నడుమ వారు కూ డా శాంతియుత జీవనానికి బాగా అలవా టు పడ్డారు. ఈ రకంగా, సాధారణ హిం దువులు, ముస్లింలు, క్రైస్తవులలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. నేటికీ అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. 

వారి కాలంలోనే బీజాలు

‘మరి, భారతదేశంలో మతపరమైన ఇ బ్బందులు ఎప్పుడు మొదలైనాయి?’ అ న్న ప్రశ్నకు ‘వలసరాజ్యాల శకంతోనే’ అన్న సమాధానం చరిత్రలో లభిస్తుంది. ‘పోర్చుగీసు వారు వ్యాపార కాంక్షతో భారతదేశంలోకి ప్రవేశించినప్పట్నుంచీ సానుకూల, సామరస్య, స్నేహపూర్వక ప్ర జాజీవ న వాతావరణంలో అననుకూల మార్పు రావడం మొదలైందని చరిత్రకారులు అంటున్నారు. 16వ శతాబ్దంలో గోవాలో జరిగిన ఒకానొక ‘విచారణ’తో అప్పటి వరకు సోదరభావంతో జీ వించిన హిందువులు, క్రైస్తవుల మధ్య అగాధం ఏర్పడి నట్టు చెప్తారు.

అంతకంటే ముందు 7వ, 8వ శతాబ్దాలలో సున్నీలు, విడిపోయిన షియాలమధ్య జరిగిన అంతర్యు ద్ధాల తర్వాత చాలామంది సాధారణ ముస్లింలు తమ పవిత్రభూములను వదిలి పారిపోయి భారతదేశానికి వచ్చారు. 

తొలితరం నాటి పార్సీలు, యూదులు, క్రైస్తవులు వంటివారివలె ఆనాడు సామర స్య భావనగల అప్పటి ముస్లింలు కూడా భారతదేశంలో ఆశ్రయం పొందారు. కానీ, వాయువ్య భారతదేశంలో విదేశీ ఇస్లామిక్ సైన్యాల ఆగమనం స్థానిక హిందూ పాలకులతో హింసాత్మక ఘర్షణలకు కారణమై నట్టు చరిత్రకారులు అంటున్నారు. అలా, విదేశాల నుంచి మతతత్త్వం భారతీయ సమాజంలోకి ‘ఇంజెక్ట్’ అయినట్టు వారు చెబుతున్నారు. మన దేశంలోని సానుకూల సమాజ నిర్మాణం ఈ రకంగానే వి చ్ఛిన్నమైనట్టు వారు తేల్చారు.

ఇటీవలి దశాబ్దాలలో భారత రాజకీయాలను కొందరు విదేశీ శక్తుల ప్రాబల్యా నికి లోనైన వారు ఉద్దేశ్యపూర్వకంగా ‘విభజన’ పాలు చేయడం మొదలుపెట్టడం బా ధాకరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన్పట్నుంచీ వారు పని గట్టుకొని ఇక్కడి ము స్లింలకు ‘మీరు ప్రత్యేకమైన వారు, మీకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి’ అంటూ బోధిస్తూ వస్తున్నారు. దీని వెనుక ముస్లిం వర్గం వారి ఓట్లతో అధికారం చేపట్టాలనే స్వార్థపూరిత లక్ష్యంతోపాటు మరో రకం గా మతశాంతిని కాపాడే ప్రయోజనమూ లేకపోలేదు.

విభజన తర్వాత మొదటి ప్ర ధాని జవహర్‌లాల్ నెహ్రూ ముస్లింల పట్ల ‘బుజ్జగింపు ధోరణి’ని ప్రదర్శించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇది దేశంలో గొప్ప శాంతిమంత్రమే కావచ్చు. కానీ, ముస్లింలలో ఆధునిక విద్య, సామాజిక అభివృద్ధికి ఇది పెద్దగా దోహదకారి కాలేదన్నది మాత్రం వాస్తవం.  

దృఢమైన లౌకిక దేశంగానే..

భారతదేశంలో హిందుత్వవాద ప్రస్థానానికి పునాదులు 20వ శతాబ్ది ప్రారంభంలోనే పడ్డాయి. 1925లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. అంతకంటే కొన్ని దశాబ్దాల ముందే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ శతాబ్దాల విదేశీ ఆక్రమణదారులు, ముస్లింలు, క్రైస్తవులను లొంగ దీసుకొని హిందు పునరుజ్జీవన పతాకాన్ని ఎగుర వేశారు. “ఆర్‌ఎస్‌ఎస్ ఎదుగుదల భారతదేశంలో హిందుత్వ మెజారిటీ వాదానికి దారితీసిందా?” అన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. ఒకపక్క సంఘ్ పరివార్, అనుబంధ సంస్థల సామాజిక శక్తి దేశంలో పెరుగుతున్నప్పటికీ భారత్ ఒక దృఢమైన లౌకిక దేశంగానే ఉందన్నది వాస్తవం.

సుమారు 145 కోట్ల జనాభాతో కూడిన రెండో అతిపెద్ద, పేద దేశంలో మతపరమైన అల్లర్లు చాలా అరుదు అనే చెప్పాలి. కశ్మీర్, పశ్చిమ బెంగాల్, తాజాగా మణిపూర్ వంటి ప్రాంతాలలో అల్లర్లు ఆగకుండా కొనసాగుతున్నప్పటికీ అవి ఆయా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమైనాయి. మెజారిటీ హిందువులు బీజేపీకి పూర్తి అనుకూలం కాదన్నది కూడా గమనార్హం. 2014 2024 మధ్య మూడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 31 శాతం, 37.36 శాతం, 36.56 శాతం ఓట్లను నమోదు చేసింది.

అంటే, సగటున 35 శాతం మాత్రమే. నిజమైన లౌకిక భావన ప్రజలందరినీ కులమతాలకు అతీతంగా ఒక్కటి చేస్తుంది. అటువంటి నేలమీది గాలి అన్ని మతాల వారినీ అక్కున చేర్చుకుంటుంది. అక్కడ పాలకులకు, ప్రజలకు మధ్య అగాధం ఉండదు. 

మన దేశానికి కావలసింది లౌకిక వా దాన్ని విడిచి పెట్టడం కాదు. లౌకిక వాదా న్ని అందరూ సవ్యంగా అర్థం చేసుకోగలగడం. తర్వాత దానిని ఆచరణలో పెట్టడం. ఒకప్పుడు శతాబ్దాల కిందట పార్సీలు, యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు ఆశ్ర యం ఇచ్చిన కాలంలో నిజమైన లౌకికవాద భావనతో భారతీయులు ఉన్నారన్న ది వాస్తవం. అయితే, మన దేశంలో వె య్యేళ్ల కిందటి సామరస్య ప్రజా జీవన పరిస్థితులు మళ్లీ నెలకొనగలవా? అందుకు ఎవరెవరు ఏమేమి చేయాలి? ఇవీ ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నలు.

-దోర్బల బాలశేఖరశర్మ