calender_icon.png 29 December, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన

08-11-2024 12:00:02 AM

ఏజెంట్ మోసం చేశాడని ఖాతాదారుడి ఆందోళన

కామారెడ్డి, నవంబర్ 7 (విజయక్రాంతి): బ్యాంకు ఏజెంట్ మోసాలను నిరసిస్తూ ఓ ఖాతాదారుడు బ్యాంక్ ఎదుట గురువారం అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జనార్దన్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మొయిన్ బ్రాంచీలో వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నాడు. నెలసరి కిస్తీ డబ్బులు బ్యాంకు ఏజెంట్ నవీన్‌కు చెల్లించాడు. ఆ డబ్బులను ఏజెంట్ బ్యాంకులో జమ చేయలేదు. సిబిల్ స్కోర్ పడిపోవడంతో జనార్దన్ బ్యాంకుకు వెళ్లి తెలుసుకోగా అసలు విషయం బయటపడింది.

దీంతో జనార్దన్ గురువా రం కెనరా బ్యాంక్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు. బ్యాంక్ మేనేజర్ స్పందించి ఏజెంట్ నవీన్‌తో మాట్లాడి జనార్దన్‌కు రావాల్సిన డబ్బులను ఇప్పిస్తామని హమీ ఇవ్వడంతో నిరసన విరమించాడు.