ఇస్లామిక్ ఆజాద్ వర్సిటీలో యువతి ఆందోళన
న్యూఢిల్లీ, నవంబర్ 3: హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇరాన్‌లో కొంతకాలం గా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి చేసిన పని చర్చనీయాంశమైంది. ఇరాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ వద్ద శనివారం గుర్తుతెలియని యువతి తన దుస్తులు విప్పదీసి నిరసన తెలిపింది.
ఈ ఆకస్మిక చర్యతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బ ంది అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే ఆ యువతి నిరసన తెలిపి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
యూనివర్సిటీ అధికారులు ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని, అందుకే ఆ విధంగా ప్రవర్తించిందని చెబుతున్నారు. 2022 సెప్టెంబర్‌లో హిజాబ్ నిబంధనను అతిక్రమించిందనే కారణంతో పోలీసులు ఓ యువతిని అరెస్ట్ చేయగా కస్టడీలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.