24-02-2025 07:38:50 PM
చర్ల (విజయ క్రాంతి): చర్ల మండలంలో ఉన్నటువంటి ప్రముఖ కవి కళాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టి లలిత నిర్వహణ సాధ్యంలో శ్రీశ్రీ కళావేదిక 144 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి చర్ల మండల కళాకారులు పాల్గొన్నారు, మండలంలోని బీర జయమ్మ తెలంగాణ ఉద్యమకారులుగా ఉంటూ తన సొంత పాటలు పాడి సభా ప్రాంగణాన్ని అదరింపజేశారు, పోలిన రమాదేవి, శంకరాచారి, శివరావు కవిత గానం చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కత్తిమండ ప్రతాప్, శాసనసభ సభ్యులు తెల్లం వెంకట్రావు, మాన్యశ్రీ పంచాక్షరయ్య చేతుల మీదుగా మండలానికి చెందిన ప్రముఖ రచయిత లిరిసిస్ట్ లక్ష్మణ్ వ్రాసిన అగణిత గుణగనుడు పాట పోస్టర్, పాటను ఆవిష్కరించారు.
ఈ పాట సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటువంటి పాటలు ఇప్పటివరకు వందకు పైగా రాశానని తను రాసిన మొదటి పాట ప్రేమలోన పడితే ఇంతేనా అనే పాట ప్రేమ పక్షులు అని షార్ట్ ఫిలిం ద్వారా విడుదలైందని మొదటి అవకాశం కల్పించిన తన మిత్రుడు ఎస్కే భాష, బెస్ట్ యూత్ ఫ్రెండ్స్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. నాటి నుండి నేటి వరకు సుమారు వంద పాటలు పైగా రాశానని నేడు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ రచనలపై అగనిత గుణగనుడు పాట రాయటం ఎంతో సంతోషంగా ఉందని సహకరించిన కత్తిమండ ప్రతాప్ కి ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో (BEST)బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మరో పాట రిలీజ్ కు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా లిరిసిస్ట్ లక్ష్మణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాకాల దుర్గాప్రసాద్ కాదే మాధవరెడ్డి పార్థసారథి పాల్రాజ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్పర్సన్ వరలక్ష్మి, కొల్లి రమావతి, మరిగంటి పద్మావతి, జిల్లా శ్రీ శ్రీ కళావేదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.