calender_icon.png 3 February, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

03-02-2025 06:38:12 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాజలింగును పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం కమిషనర్ ను కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా, పట్టణ అధ్యక్షులు చిలగాని సుదర్శన్, కొంపెల్లి రమేష్ కుమార్ లు మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సామల సత్యనారాయణ, కోశాధికారి గాదాసు శంకరయ్య, యూత్ అధ్యక్షులు ఉడుత చంద్ర మొగిలి, వెల్డి ప్రభాకర్, బండారి రాజేశం, చిలగాని చంద్రయ్య, కామని మార్కండేయ, రామ్ సురేష్, పత్తిపాక రవీందర్, మోర శంకరయ్యలు పాల్గొన్నారు.