మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తుంగపెల్లి తుంగ పిండి రాజలింగును బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జంగిల్ రవీందర్ ఆద్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ను మర్యాదపూర్వకంగ కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా, సెంట్రల్ నాయకులు, మహిళ నాయకురాలు యూత్, విద్యార్థి, సోషల్ మీడియా, నాయకులు పాల్గొన్నారు.