మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపల్ పరిధిలోని నార్లాపూర్ కి చెందిన బుడిగె సమ్మయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడు శివ కుమార్ చార్టెడ్ అకౌంట్స్ లో ఘనవిజయం సాధించడంతో కురుమ సంఘం ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అద్యక్షురాలు బండి రమ-శంకర్ ల ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన శివ కుమార్ చిన్ననాటి నుండి చదువులో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శేగొండ శంకరయ్య, ఏనుగుల బీరయ్య, పోషన్న, సుధాకర్, సత్యనారాయణ, సాగర్, మల్లన్న, ఒగ్గు మల్లయ్య, గోపాల్, తిరుపతి, రమేష్, సురేష్ గట్టయ్యలు పాల్గొన్నారు.