calender_icon.png 4 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

03-04-2025 10:26:17 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల వసూళ్లలో 77.35% సాధించడంతో కమీషనర్, డైరెక్టర్ పురపాలక పరిపాలన శాఖ, టీకే శ్రీదేవి చేతుల మీదుగా పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. హైదరాబాద్ లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆస్తి పన్నుల వసూళ్లలో రికార్డు స్థాయిలో పన్నులు చేయడం పట్ల ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాన్ని అందించి సన్మానించారు.

ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగం మాట్లాడుతూ.. పట్టణంలో అస్తి పన్నుల వసూళ్లలో 2025-26 సంవత్సరంలో 100% ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించి పన్నుల వసూలుకు కృషి చేస్తామన్నారు. అస్తి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారుల సిబ్బంది సహకారం మరువలేనిదని వారి సహకారంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా మెరుగైన ఆస్తి పన్నులు వసూలు చేసేలా కృషి చేస్తామన్నారు.