మందమర్రి (విజయక్రాంతి): జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ను బీజేపీ మండలశాఖ, పట్టణ కమిటీల ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. మంగళవారం చెన్నూరు పట్టణంలోనీ ఆయన స్వగృహంలో బీజేపీ సీనియర్ నాయకులు డివి దీక్షితులు, దేవరనేని సంజీవరావులతో కలిసి మండల బిజెపి అధ్యక్షులు గిర్నేనీ జనార్ధన్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి గ్రామగ్రామాన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.