calender_icon.png 6 February, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టరేట్ గ్రహీత రామారావుకు ఘన సన్మానం

05-02-2025 10:42:38 PM

కోదాడ (విజయక్రాంతి): విద్యా విభాగంలో వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ డాక్టరేట్ గ్రహీత మామిడి రామారావుకు కోదాడ ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చలిగంటి మురళి బుధవారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జనవరి 31న ఢిల్లీలో ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ సంస్థ ఏర్పాటు చేసిన డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించారనీ తెలిపారు. కోదాడ ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లపు శ్రీనివాస్, నకిరికంటి కరుణాకర్ పాల్గొన్నారు.