calender_icon.png 11 March, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీపై వెళ్తున్న అధికారినికి ఘన సన్మానం

05-03-2025 07:30:43 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఏరియా ఎస్టేట్ అధికారినిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న స్వప్నను సింగరేణి ఏరియా అధికారులు ఘనంగా సన్మానించారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఇంచార్జ్ జిఎం అబ్దుల్ ఖాదీర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్క అధికారికి ఉన్నత పదవులు రావడం ఉన్న స్థలము నుండి వేరొక స్థలంలోకి బదిలీపై వెళ్లడం అని వార్యం అని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్టేట్ అధికారిగా ఆమె ఏరియాకు అందించిన సేవలను కొనియాడారు. అలాగే ఏరియాకు గోలేటి నుండి ఎస్టేట్ ఆఫీసర్ గా బదిలీపై విచ్చేసిన నవనీతంకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎస్ఓటు జిఎం రవీందర్, జనరల్ మేనేజర్ కార్యాలయం, అన్ని గనులు, డిపార్ట్మెంట్ల హెచ్ఓడి లు, అధికారులు పాల్గొన్నారు.